ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:34 PM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధ వారం మొదటి రోజు ప్రశాంతంగా ముగి శాయి.

నాగర్‌కర్నూల్ టౌన్/గద్వాల సర్కిల్/ వనపర్తిరూరల్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధ వారం మొదటి రోజు ప్రశాంతంగా ముగి శాయి. ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు ని ర్వహించారు. ఉదయం 8 గంటల 45 ని మిషాల తర్వాత పరీక్ష హాలులోకి అనుమ తించలేదు. ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టు లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించా రు. మొదటి రోజు నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 6,817 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,449 మంది హాజరయ్యా రు. జనరల్ విద్యార్థులు 5,172 మందికి గాను 4,924 మంది విద్యార్థులు హాజర య్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,645 మంది హాజరు కావాల్సి ఉండగా 1,525 మంది హాజ రయ్యారు. అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో తొలిరోజు జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 96.34శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 4,235 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,080 మంది హాజరైనట్లు ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ హృదయరాజు తెలిపారు. జనరల్ విద్యార్థులు 3,415 మంది హాజరుకావాల్సి ఉండగా 3,304 మంది హాజరు. ఒకేష నల్ 820మంది విద్యార్థులకు గా ను 776 మంది హాజరైనట్లు ఆ యన తెలిపారు. వనపర్తి జిల్లాలో మొత్తం 6,714 మంది విద్యార్థు లు హాజరు కావ లసి ఉండగా 6,476 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌక ర్యం ఏర్పాటు చేయక పోవడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను ఎప్ప టికప్పుడు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తనిఖీ చేశారు. మొదటిరోజు మూడు జిల్లాల్లో మాల్ ప్రాక్టిసింగ్ కేసు నమోదు కాలేదు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్ విధించారు. పరీక్షలు జరుగుతున్న సమ యంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేయించారు.