Share News

మూర్చ వ్యాధితోకరిగెటలో పడి రైతు మృతి

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:35 PM

మూర్చ వ్యాధితో కరిగెటలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకున్నది.

మూర్చ వ్యాధితోకరిగెటలో పడి రైతు మృతి

కోడేరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : మూర్చ వ్యాధితో కరిగెటలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకున్నది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... బావాయిపల్లి గ్రామానికి చెందిన తెలుగు జడ్పోలు కురుమయ్య (35) సోమవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో కరిగెట చేసే పని చేపట్టాడు. పొలంలో వడ్డు వరాలు చేస్తూ మూర్చ వ్యాధితో అకస్మాత్తుగా కరిగేటలో పడి మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన కురుమయ్య మృతితో కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 06 , 2025 | 11:35 PM