Share News

అవినినీతి పాలనకు చరమగీతం

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:17 PM

అవినీతితో కూరుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

అవినినీతి పాలనకు చరమగీతం
జడ్చర్లలో సంబురాలు జరుపుకుంటున్న బీజేపీ శ్రేణులు

- ఢిల్లీలో విజయంతో సంబురాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : అవినీతితో కూరుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల సందర్భంగా బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆ పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోయిందన్నారు. అబద్దపు మాటలు, అవినీతిలో కూరుకుపోయిన ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీలను ఢిఈ్ల ప్రజలు విస్మరించారన్నారు. మోదీ ఇచ్చిన ముఖ్త్‌ కాంగ్రెస్‌ పిలుపును అందుకొని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే బీజేపీకి పట్టం కట్టారన్నారు. భారీ మెజారిటీతో 48 సీట్లు ఇచ్చి అండగా నిలిచారని, రానున్న రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయశ్రీ, బురుజు రాజేందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు పాండురంగారెడ్డి, పద్మవేణి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, అంజయ్య, రాములు, పడాకుల సత్యం పాల్గొన్నారు.

జడ్చర్ల, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో శనివారం జడ్చర్లలో బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పట్టణంలోని నేతాజీచౌరస్తా వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు ఎంబీ బాలకృష్ణ, ముచ్చర్ల కృష్ణయ్య, ఎడ్ల బాలవర్దన్‌గౌడ్‌, సాహితీరెడ్డి, బుక్క నవీన్‌, శ్రీనాథ్‌, మురళీకృష్ణ, మోహన్‌నాయక్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నరేశ్‌, ధీరజ్‌, చెవ్వ నాగరాజు, లక్ష్మీ, అంజలి, కరుణ పాల్గొన్నారు.

మిడ్జిల్‌/ హన్వాడ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడంతో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, మండల అధ్యక్షుడు నరేష్‌నాయక్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నరేందర్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడు చిర్ర శేఖర్‌రెడ్డి, గిరిజనమోర్చా మండల అధ్యక్షుడు శ్రీనునాయక్‌, నాయకులు కృష్ణయ్య, శివశంకర్‌, నవీన్‌, పట్నం జంగయ్య, మల్లేష్‌, శ్రీను, తేజ, సతీష్‌, రామకృష్ణ, టిల్లు ఉన్నారు. హన్వాడ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. ప్రధాన రహదారిపై డప్పులతో ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు రమణరెడ్డి, కొండ లింగన్న, మహేందర్‌రెడ్డి, రఘురాంగౌడ్‌, శ్రీనువాసులు, శేఖర్‌, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:17 PM