Share News

బీసీ సంక్షేమ అధికారిని సస్పెండ్‌ చేయాలి

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:37 PM

బీసీ సంక్షేమ అధికారిని సస్పెండ్‌ చేయకపోతే కలెక్టరేట్‌ ముట్టడిస్తామని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌ హెచ్చరించారు.

బీసీ సంక్షేమ అధికారిని సస్పెండ్‌ చేయాలి
మాట్లాడుతున్న పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌

- అవినీతి అధికారిని కాపాడటం సరికాదు

- పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌

వనపర్తి రూరల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ అధికారిని సస్పెండ్‌ చేయకపోతే కలెక్టరేట్‌ ముట్టడిస్తామని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌ హెచ్చరించారు. బుధవారం పట్టణలోని జిల్లా కార్యాలయంలో వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి అవి నీతి, అక్రమాలపై రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. విచారణకు వచ్చిన రాష్ట్ర అధికారి జిల్లా అధికారితో కుమ్మక్కయ్యారని ఆరోపిం చారు. విచారణ రిపోర్టు బయట పెట్టకుండా ఆ యనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపా రు. వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థి నుల వసతి కోసం కేటాయించిన అద్దె నిధులను అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపిం చారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే, జిల్లా లో కలెక్టర్‌ సస్పెండ్‌ చేయకుండా కాపాడు తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కార్య దర్శి సాయికృష్ణ, రాకేష్‌, ప్రవీణ్‌, బీచుపల్లి, రవీం దర్‌, వేణుగోపాల్‌, రాజారెడ్డి, చరణ్‌ తేజ, గణేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:37 PM