నాయకత్వ బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:53 PM
ఆదివాసీల్లో నాయకత్వ బలపోతమే లక్ష్యం గా శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు ఏఐసీసీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ విభాగం) జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు అన్నా రు.

- ఏఐసీసీ జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు
- ఉమ్మడి జిల్లా స్థాయి ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ శిబిరం ముగింపు
కొల్లాపూర్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ఆదివాసీల్లో నాయకత్వ బలపోతమే లక్ష్యం గా శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు ఏఐసీసీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ విభాగం) జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు అన్నా రు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండ లం సోమశిలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి ఆదివాసీ కాంగ్రెస్ మూడు రోజుల శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంత్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ విక్రమ్ బూరియ, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్యా నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల రాజు మాట్లాడు తూ మూడు రోజుల శిక్షణతో సరిపోదని, క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారం కృషి చేస్తూ, పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 11 శాతం ఉన్న గిరిజనులతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించాల న్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటై పని చేయనున్నట్లు అను మానం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్ని కల్లో రిజర్వు స్థానాల్లో సైతం పోటీ చేసే స్థాయికి ఆదివాసీ నాయకులు ఎదగాలని ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాల పాలన లో బీఆర్‌ఎస్ పార్టీ ఐటీడీఏ, ట్రైకార్ సంస్థ లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటిం చిన వెంటనే ఆదివాసీ నాయకులను ఎన్నికల్లో పోటీకి నిలబెట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ సీట్లలో కూడా పోటీ చేసేలా రాజకీయ నైపుణ్యాన్ని పెంపొందిం చుకోవాలన్నారు. ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ డైనమిక్ పార్టీ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హ క్కుల అమలు కోసం ఆదివాసీ నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే కుల గణన చేసే దమ్ము, ధైర్యం ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసి స్థానిక సంస్థల ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.