Share News

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:01 PM

యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు.

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి
మక్తల్‌లోని స్వామి వివేకానంద చౌరస్తాలో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహిస్తున్న ఏబీవీపీ, వీహెచ్‌పీ నాయకులు

- మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి

- ఘనంగా జయంతి కార్యక్రమాలు

- విగ్రహాలు, చిత్రపటాలకు ఘన నివాళులు

నారాయణపేట టౌన్‌ /మక్తల్‌/మక్తల్‌ రూరల్‌/దామరగిద్ద/ కృష్ణ/ధన్వాడ/కొత్తపల్లి /కోస్గి రూరల్‌/మరికల్‌/మద్దూర్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ పార్కులో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా పార్టీ నాయకు లు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివా ళులు అర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప ట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్‌, మాజీ ఎంపీపీ బక్క నర్సప్ప, మాజీ వైస్‌ ఎంపీపీ దామో దర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, పీఆర్టీ యూ ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని నిర్వ హించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు యా ద్గీర్‌ జనార్దన్‌రెడ్డి, డీఎస్‌వో భానుప్రకాష్‌, నాగా ర్జునరెడ్డి, శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, గోపాలకృష్ణ, నరేష్‌ తదితరులున్నారు.

అదేవిధంగా, మక్తల్‌ పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో వీహెచ్‌పీ, భజరంగదళ్‌ నాయకులు వివేకానందుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అలాగే ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాకిటి శ్రీహరి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంఈవో అనిల్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వ హించారు. కార్యక్రమాల్లో భజరంగదళ్‌ జిల్లా నా యకుడు పస్పుల భీమేష్‌, వీహెచ్‌పీ ప్రఖండ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌, తపస్‌ మండల ప్రధాన కార్యదర్శి రాకేష్‌, నాయకులు పాల్గొన్నా రు. అలాగే, మక్తల్‌ మండలంలోని జక్లేర్‌ గ్రా మంలో లయన్స్‌క్లబ్‌ మక్తల్‌ భీమా ఆధ్వర్యంలో ఆదివారం వివేకానంద విగ్రహానికి క్లబ్‌ అధ్య క్షుడు డీవీ చారి బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్లబ్‌ సెక్రటరీ కిరణ్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి అంజన్‌ప్రసాద్‌, టి.నాగరాజు, అనుగొండ శ్రీనివాస్‌, రమేష్‌రావు, సూగూరు జైపాల్‌రెడ్డి, అంబదాస్‌రావు, మఠం వాదిరాజు, మామిళ్ల పృథ్వీరాజ్‌, సాయిజ్యోతి తదితరులున్నారు.

దామరగిద్ద మండల కేంద్రంలో వివేకానం దుని విగ్రహానికి బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాల్‌ రావు, మండల అధ్యక్షుడు సంజీవ్‌గౌడ్‌, ఆశన్‌ పల్లి గ్రామంలో భీమయ్యగౌడ్‌, సత్తి సత్యనారా యణ, సంజీవరెడ్డి, రవీందర్‌రెడ్డి, నరేష్‌రెడ్డి, కృష్ణ మండల కేంద్రంలో బీజేపీ జిల్లా ఉపాధ్య క్షుడు సోమశేఖర్‌గౌడ్‌, పిట్టల సిద్దప్ప, నారాయ ణభట్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ధన్వాడలో షిర్డీసాయి యువజన సంఘం, శ్రీవినాయక సాయి యువజన సంఘం ఆధ్వ ర్యంలో వివేకానంద జయంతిని నిర్వహించారు. కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ చౌరస్తాలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

కోస్గి మండల కేంద్రంలోని వివేకానంద కూడ లితో పాటు, గుండుమాల్‌ పంచాయతీ కార్యాల య ఆవరణలో యువజన సంఘం నాయకులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులు అర్పించారు.

మరికల్‌లో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో స్థా నిక ఇందిరాగాంఽధీ చౌరస్తాలో వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మద్దూర్‌ మండల కేంద్రంలోని పెదిరిపాడ్‌ చౌరస్తాలో యువజన సంఘం, ఆర్యవైశ్య మం డల సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:01 PM