ప్రభుత్వ పాఠశాలలకు పురుగుల బియ్యం సరఫరా
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:43 PM
ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పురుగులు పట్టిన బియ్యాన్ని సరఫరా చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఖిల్లాఘణపురం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పురుగులు పట్టిన బియ్యాన్ని సరఫరా చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అప్పారెడ్డిపల్లి, వెనికి తండా ప్రభుత్వ పాఠశాల లకు గురువారం సరఫరా చేసిన బియ్యంలో అ ధికంగా పురుగులు ఉన్నట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. గతంలో మామిడి మాడ పాఠశాల కు సైతం పురుగులు ఉన్న బియ్యం సరఫరా చే స్తే స్టాక్ పాయింట్‌కు వాపస్ పంపినట్లు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చెన్నప్ప తెలిపారు. ప్రభుత్వ బడులకు పంపిస్తున్న బి య్యం పాత బియ్యమని అధికారులు తెలుపుతు న్నట్లు ఉపాధ్యాయులు వాపోయారు. పాత బి య్యమైన అన్నం వండితే మెత్తగా ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ మధ్యకాలంలో మండలంలోని చాలా ప్రభుత్వ పాఠశాలకు మ ధ్యాహ్న భోజనం పథకం కింద సరఫరా చేస్తు న్న బియ్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించ డం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.