‘ఉపాధి’ ఉద్యోగుల పోరుబాట
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:49 PM
ఉపాధి హామీ పథకం అమలులో కీలకంగా పనిచే స్తున్న ఉద్యోగులు సమస్యల సాధనకు పోరుబాట కు సిద్ధమవుతున్నారు...

- అమలు కాని పే స్కేల్.. 8 ఏడాదికాలంగా ఎదురుచూపులే
- పదోన్నతులు, బదిలీలలో తాత్సారం 8 మూడు నెలలుగా అందని వేతనాలు
- ఆందోళన కార్యక్రమాలకు ప్రణాళిక
మహబూబ్‌నగర్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం అమలులో కీలకంగా పనిచే స్తున్న ఉద్యోగులు సమస్యల సాధనకు పోరుబాట కు సిద్ధమవుతున్నారు... పే స్కేల్ గతేడాది ఫిబ్ర వరి 2 నుంచి అమలు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ కాకపోవడంతో ఆందోళన కార్యక్రమాలకు సన్నద్ధవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ పథఽకం కింద 638 మంది టెక్నికల్ అసిస్టెం ట్లుగా, ఏపీవోలుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఇం జనీరింగ్ సలహాదారులుగా, మేనేజర్లుగా పనిచేస్తు న్నారు. ఐకేపీ సెర్ప్ ఉద్యోగులకు ఇప్పటికే పే స్కేల్ అమలవుతుండగా అదే తరహాలో తమకూ అమలు చేయాలని కోరు తున్నా వారి గురించి ప ట్టించుకునే పరిస్థితి లేక పోయింది. పే స్కేల్ అమలు కా కపోవడంతో ప దోన్నతులు, ఇంక్రి మెంట్‌లు, బదిలీ విషయంలో ఇ బ్బందులు వ స్తున్నాయి. 2006 నుంచి ఏ కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం 18 ఏళ్లుగా అదే కేడర్‌లో పనిచేస్తున్నారు. జీతాలు కూడా ఆశించిన మేర పెరగకపోవడంతో పే స్కేల్ అమలు చేయాలని ఎప్పటిపుంచో డి మాండ్ చేస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2న జాతీయ ఉపాధిహామీ పథకం అమలురోజున పేస్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోజు ప్రకటన రాక పోగా, ఏడాదిగా ఉద్యోగులు సం బంధిత మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఆత్మీయ భరోసా అమలులో...
ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం అమలుకు ఉపాధి హామీ పథకమే కీలకంగా ఉంది. భూమి లేని నిరుపేదలు ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని దినాలు చేసి ఉండాలన్న నిబంధన ఉండటంతో ఇన్నాళ్లు పనులకు రాని భూమిలేని నిరుపేదలు కూడా వస్తున్నారు. ఈ పథకంపై ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి నాటి నుంచి సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తున్నామని, సంబంధిత పథకం కోసం అర్హుల జాబితాలను తామే తయారు చేయాల్సి ఉండటంతో సంక్రాంతి పండగ వేళల్లోనూ పనిచేశామని, తమ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
పోరుబాటకు సిద్ధమైన ఉద్యోగులు
పే స్కేలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది కాలమైనా హామీని అమలు చేయకపోవడంతో ఉద్యోగులు తిరిగి తిరిగి వేసారి చివరకు పోరుబాటకు సిద్ధమయ్యారు. డ్యూటీ చేస్తూనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 15 రోజుల నిరసన షెడ్యూల్‌ను రూపొందించారు.
ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో పెన్‌డౌన్, షెట్‌డౌన్, 2న ఉపాధి హామీ ఆవిర్బావ దినో త్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులను కలువడం, 3న స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధు లకు వినతిపత్రాల అందజేత, 4న జిల్లాల కలెక్టర్‌లకు వినతిపత్రాల అందజేత, 5న కలెక్టరేట్‌ల ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు, 6న జిల్లా ఎంపీడీవోలు, సీఈవో, టీఎన్జీవో, టీజీవో సంఘాలకు వినతులు సమర్పించడం, 7న ప్రజాభవన్‌లో వినతిపత్రాలు అందజేత, 8న పీఆర్ అండ్ ఆర్‌డి కమిషనర్‌కు వినతిపత్రం, 9, 10వ తేదీల్లో తెలంగాణ మంత్రులకు వినతిపత్రాల అందజేత, 11న సీఆర్‌డీ కార్యాలయంలో శాంతియుత నిరసన కార్యక్రమం, చివరకు ఈనెల 12న కమిషనర్‌కు నోటీసు ఇచ్చి సమ్మెకు దిగాలని నిర్ణయించారు.