పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:32 PM
బడిఈ డు పిల్లలను ఏవరైనా పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటా మని బాలల సంరక్షణ అధికారులు హెచ్చరిం చారు.

బాలల సంరక్షణ అధికారులు
ధరూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): బడిఈ డు పిల్లలను ఏవరైనా పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటా మని బాలల సంరక్షణ అధికారులు హెచ్చరిం చారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రు లు తమ పిల్లలను కచ్చితంగా బడులకు పంపా లని అధికారులు సూచించారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా గురువారం ధరూరు మండల పరిధిలోని దోర్నాల, ధరూర్, సోంపురం, మన్నా పురం, పార్చర్ల గ్రామాల్లో జిల్లా బాలల సంరక్ష ణ అధికారులు ప ర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పదవ తర గతిలో డ్రాప్ ఔట్ అ యిన విద్యార్థుల వి వరాలను సేకరిం చారు. గ్రామాల్లో ఇం టింటికీ తిరిగిన అధి కారులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ముఖ్యంగా చదు వు యొక్క ప్రాముఖ్యతను గురించి తల్లిదం డ్రులకు వివరించారు. మధ్యలో చదువు మా నిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది వారికి అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థుల ను బాగా చదివించి వారిని ప్రయోజకులను చేయాలన్నారు. ప్రతి విద్యార్థిలో అద్భుత ప్రతిభ దాగి ఉం టుందని, ఉన్నత చదువుల ద్వారా జీవితంలో ఉన్నతస్థానంలో స్థిరపడేలా ప్రణాళికాబద్దంగా చదవించాలని సూచించారు. అలాగే మెకానిక్ షాప్‌లు, కిరాణం దుకాణాల్లో బడిఈడు పిల్లల ను పనిలో పెట్టుకునే వారిపై చర్యలు తీసుకుం టామని ఘాటుగా హెచ్చరించారు. కార్యక్ర మంలో ఎస్‌ఐ విజయ్, బాలల సంరక్షణ అధికా రులు పద్మ, నవీన్‌కుమార్, లేబర్ డిపార్ట్‌మెంట్ మొహిన్ పాషా, కానిస్టేబుళ్లు రాజు, నరేష్, మం జుల, ఎన్‌జీవో ధనలక్ష్మి, సీఆర్‌పీలు నర్సింహు లు, బతుకన్న ఉన్నారు.