మంచినీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:40 PM
వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- తాగునీటిపై అధికారులతో సమీక్ష
మక్తల్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో తాగ నీటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ని యోజకవర్గంలో తాగునీటి సమస్య ఏర్పడకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడితే వెంటనే తనకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
మక్తల్ పట్టణంలోని నేతాజీనగర్‌లోని ప్రభుత్వ స్థలంలో నూతన సబ్ రిజిస్ర్టార్ కార్యా లయ నిర్మాణానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా అన్ని వసతులతో సబ్ రిజి స్ర్టార్ కార్యాలయ నిర్మాణం చేపడుతున్నట్లు తె లిపారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, వివిధ పార్టీల నాయకులు నర్సింహారెడ్డి, నాగరాజు, మహేష్, కర్ని కృష్ణమూర్తి తదితరులున్నారు.