బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:35 PM
జిల్లాలో బాల్య వివాహాల నివా రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆద ర్శ్ సురభి ఆదేశించారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బాల్య వివాహాల నివా రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆద ర్శ్ సురభి ఆదేశించారు. ప్రధానమంత్రి 2015 జ నవరి 22న బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్ర మాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్త యింది. ఈ సందర్భంగా జనవరి 22 నుంచి మార్చి 8 వరకు మహిళా సాధికారత అమ్మాయి ల సంరక్షణ సాధికారతపై సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వ హించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి స మన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో బాల్య వి వాహాలు పూర్తిగా అరికట్టడం, అమ్మాయిలకు ర క్తహీనత నుంచి విముక్తి కల్పించడం, విద్యాభ్యా సాలు అందించడం జరగాలన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరై నా సరే వెంటనే 1098టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా లో ప్రతీ వెయ్యి మంది పురుషుల్లో కేవలం 888 మంది మహిళలు మాత్రమే ఉన్నారని, ఈ అం తరాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాల ని, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అమ్మాయిల చదువులు, పెళ్లి కోసం కేంద్ర ప్ర భుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం తీ సుకొచ్చిందన్నారు. అనంతరం బేటీ బచావో... బే టీ పడావో ప్రచార పోస్టర్ విడుదల చేశారు. అ దనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) యాదయ్య, ఆర్డీవో సు బ్రహ్మణ్యం, డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, జి ల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీసీపీవో రాం బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.