Share News

ఘనంగా శివనారాయణస్వామి జాతర

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:29 PM

మండల పరిధిలో ని నారాయణపురం గ్రామంలో శుక్రవారం బాలయోగి శివనారా యణస్వామి ఉత్సవాలు ఘనంగా జరిపారు.

 ఘనంగా శివనారాయణస్వామి జాతర
కల్యాణోత్సవం జరిపిస్తున్న పండితులు

- కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

మానవపాడు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ని నారాయణపురం గ్రామంలో శుక్రవారం బాలయోగి శివనారా యణస్వామి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలయోగి శివనారాయణ స్వామి ఆశ్రమం ప్రాం గణంలో సత్యనారాయణ స్వామి, భూదేవి మూల విగ్రహాలకు కల్యాణోత్సవాన్ని వేదపండితుల నడుమ. ఐదు జంటలతో కలిసి జరిపించారు. ప్రతీ ఏడాది ఈ జాతర నిర్వహించడం ఆ నవాయితీగా వస్తుందని, కల్యాణోత్సవం అనంతరం భక్తులకు శివనారాయణస్వామి సమాధి దర్శనం క ల్పించి భక్తులకు అన్నదానం నిర్వహించారు. శుక్రవారం సా యంత్రం పొద్దుపోయాక ఆలయం నుంచి గ్రామ పురవీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి నుంచి మొదలు కొని తెల్లవారుజాము వరకు ఆలయంలో అఖండ భజన కార్య క్రమం ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 07 , 2025 | 11:29 PM