సింగరేణి ప్రణాళిక సిద్ధం
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:07 AM
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన 8 మంది చిక్కుకున్న వా రిని వెలికి తీసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంత భయంతో ఉన్నారనేది వాస్తవం. పనులు కూడా మందకొ డిగా సాగుతున్నాయి.
- ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పనులు సాగేందుకు, ప్రమాద నివారణకు...
- నేడో రేపో దోమలపెంటకు చేరనున్న సామగ్రి
- సింగరేణి కాలరీస్ జీఎం డీఎల్ భైద్యా నేతృత్వంలో మరిన్ని బృందాలు
దోమలపెంట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన 8 మంది చిక్కుకున్న వా రిని వెలికి తీసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంత భయంతో ఉన్నారనేది వాస్తవం. పనులు కూడా మందకొ డిగా సాగుతున్నాయి. ఇక ముందు మరో ప్రమాదం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సింగరేణి గనుల లో వాడే విధానాన్ని ఉపయోగించుకోవాలని ప్రణాళికను సిద్ధం చేశా రు. సింగరేణి కాలరీస్ జీఎం డీఎల్ భైద్యా నేతృత్వంలో మరిన్ని బృందాలు ఎస్‌ఎల్‌బీసీకి రానున్నాయి.
రాబోయే ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తింపునకు..
సింగరేణి బొగ్గు గనుల్లో వాడే విధానాన్ని ఉపయోగించి ఎస్ ఎల్‌బీసీ సొరంగంలో కూలిన శిథిలాలను తొలగించేందుకు ఉప యోగించనున్నారు. సొరంగం లోపల అడుగు భాగంలో వెడ్‌జెస్ కర్రలతో బేస్‌ను ఏర్పాటు చేసి ఆపైన ఎటూ నాలుగు ఇన్చ్‌ల మందంలో నాలుగున్నర అడుగుల పొడవున ఉండే ఈ కర్రలను అంచెలంచెలుగా ఎత్తుకు పెంచుకుంటారు. ఇందుకు ప్రత్యేక మైన కర్రలను ఎంచుకుంటారు. ఆపై భాగంలో ఇనుములో కూడి న ఒక మీటర్ పొడవు ఉండే టైగర్ క్లాక్స్‌నూ (ప్లేట్స్) అమర్చు తారు. వీటికి అనుబంధంగా అడుగున్నర బోల్ట్‌ను కొండకు డ్రిల్ చేసి బిగిస్తారు. పనులు చేపట్టే ప్రాంతంలో లోడ్ సెల్, టిల్‌టిల్ అనే పరికరాలు అమర్చుతారు. కొండలు కూలే ముందు ఒత్తిడికి గురై 3 నుంచి 5 నిమిషాల్లో ప్రమాదం సంభవిస్తుందనే సంకేతం తో ఒక రకమైన శబ్ధంతో పాటు, టిల్‌టిల్ పరికరం రెడ్ సిగ్నల్‌ను ఇస్తుంది. తద్వారా ప్రమాదం జరిగే ప్రాంతం నుంచి తప్పించుకు నేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే అనుభవం ఉన్న కార్మికులు పేర్కొంటున్నారు. ఇక సొరంగంలో శిథిలాల కింద ఉన్నటువంటి టీబీఎం మిషన్ విడిభాగాలను తొలగించేందుకు ప్రత్యేకంగా గ్యాస్ కట్టర్‌లు, వెల్డింగ్ కట్టర్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో తవ్వకాల పనులు వేగవంతం కానున్నాయి.
ప్రమాదకరమైన పరిస్థితిలో పనులు
ఫ సొరంగంలో టీబీఎం మిషన్ వరకు ఎక్సకవేటర్ వెళ్లేందుకు మరో 24 గంటల సమ యం పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతం శిథిలా ల కింద నుంచి వచ్చే నీటిని 24 గంటలు పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం వచ్చే నీరు తేటగా ఉన్నందున ప్రస్తుతం కిండలు కూలడం లేదు అనేది ఒక సంకేతం. నీరు బురదగా మారిందం టే మరో ప్రమాదానికి సంకేతం ఇక్కడ చాలా సున్నితంగా, జాగ్రత్తగా పనులు ముందుకు సాగాలి.
- డీఎల్ భైద్యా,
సింగరేణి కాలరీస్ జీఎం