Share News

భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:36 PM

మహాశివరాత్రి సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జా ము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి.

భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
కానాయపల్లిలోని కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి

- ఘనంగా శివపార్వతుల కల్యాణం

- శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : మహాశివరాత్రి సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జా ము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు ని ర్వహించారు. జిల్లా కేంద్రంలోని చింతల ఆంజ నేయ స్వామి, నడిమిగేరిలో పాండురంగ శివా లయం, అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం లో శివుని ఆలయాన్ని భక్తులు సందర్శించి స్వా మి వారిని పూజించి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉపవాస దీక్షలు చేసే భక్తులు ఫలాహా రాలు, మంచినీళ్లతో తమ దీక్షలను భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. ఈ సందర్భంగా మార్కెట్లలో పండ్లు భారీగా కొనుగోలు జరిగాయి.

రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వనపర్తి అర్బన్‌: అడ్డాకుల మండలంలోని కందూరు రామ లింగేశ్వరస్వామిని ఎమ్మెల్యే మేఘారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఖిల్లాఘణపురం: మండల కేంద్రంలోని ఘ న లింగేశ్వర వీరభద్ర స్వామి ఆలయ ఆవర ణలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. కుర్వ గేరి శివా లయంలో భక్తులు 21వేల దీపాలను వెలిగించి ప్రత్యే క పూజలు చేశారు.

ఆత్మకూరు: పట్టణం లోని శివాలయం, బాల బ్రహ్మేశ్వర స్వామి, నీల కంఠేశ్వర స్వామి, వేంక టేశ్వర స్వామి ఆలయా లకు భక్తులు పోటెత్తారు. చ ర్ల పరమేశ్వర స్వామి జాతర సందర్భంగా భక్తులు భారీ సం ఖ్యలో తరలి వచ్చి పూజలు చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వర కు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

భక్తులకు అన్నదానం

అమరచింత: పట్టణంలోని శివ చౌ డేశ్వరి, భక్త మార్కండేయ శివాలయం, నందిమల్ల పీజేపీ క్యాంపులో శివాల యం, చంద్రఘడ్‌ కోటపై రామలిం గేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. శివ చౌడేశ్వరి ఆలయ ఆవరణలో అన్నదానం చేశారు.

Updated Date - Feb 26 , 2025 | 11:36 PM