లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో చదవాలి
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:37 PM
ప్రతీ ఒక్కరు లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికాబ ద్ధంగా చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి
ధరూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికాబ ద్ధంగా చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు. బుధవారం ధరూరు మం డల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల వి ద్యాలయంలో నిర్వహించిన సమావేశానికి న్యా యాధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలందరూ చట్టాలు, బాల్యవివాహాల ని ర్మూలనపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధిం చే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడం ద్వారా మం చిమార్కులు సాధించవచ్చన్నారు. శాస్త్ర, సాంకే తిక రంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నార్నారు. బాలికలు స్వ యం సమృద్ధి సాధించాలంటే చదువు ఎంతో ముఖ్యమన్నారు. బాల్య వివాహాల వలన కలిగే నష్టాల గురించి తెలియజేశారు. సమస్యలు ఉం టే రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఉన్నారు.