Share News

ఎస్సీ వర్గీకరణ, కులగణన అభినందనీయం

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:13 PM

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు 50 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ, కులగణన చేపట్టడం అభినందనీయమని కాంగ్రెస్‌ పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఏర్పుల నాగరాజు, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు బండి మల్లేష్‌ అన్నారు.

ఎస్సీ వర్గీకరణ, కులగణన అభినందనీయం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

మహబూబ్‌నగర్‌, మహ్మదాబాద్‌ చిన్నచింతకుంట, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు 50 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ, కులగణన చేపట్టడం అభినందనీయమని కాంగ్రెస్‌ పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఏర్పుల నాగరాజు, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు బండి మల్లేష్‌ అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ పట్టణ ఎస్సీ సెల్‌, బీసీసెల్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపవ ుుఖ్యమంత్రి భటి ్టవిక్రమార్క, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారన్నారు. నాయకులు మహేశ్‌, జగదీశ్‌, రాంచంద్రయ్య, గంజి ఆంజనేయులు, మురళీధర్‌గౌడ్‌, సంగీతశంకర్‌, అక్బర్‌, శ్రీనివాస్‌, నాగయ్య, చుక్క యాదయ్య, టంకర కృష్ణయ్య, సంజీవ్‌కుమార్‌ పాల్గొన్నారు. మహ్మదాబాద్‌ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కెఎం నారాయణ, నాయకులు బాలముకుందం, లక్ష్మికాంత్‌రెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని బస్టాండు కూడలిలో గాంధీ విగ్రహం ఎదుట దళిత సంఘం అధ్యక్షుడు శేఖర్‌ ఆధ్వరర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీఎంఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. శ్యాంసన్‌, వెంకటన్న, సుందర్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

వర్గీకరణపై ఎమ్మార్పీఎస్‌ శ్రేణుల హర్షం

పాలమూరు : ఎస్సీ వర్గీకరణ ఏబీసీ గ్రూపులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపటంపై ఎమ్మార్పీఎస్‌ (ఆర్‌ఆర్‌) శ్రేణులు బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వర్గీకరణ కోసం పోరాటం చేసిన మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పించారు. 30 ఏళ్ల ఉద్యమానికి పరిష్కారం దొరికిందని, మాదిగ, మాదిగ ఉపకులాలకు ఇది చారిత్రాత్మక దినం అని రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాసు అన్నారు. సింగిరెడ్డి పరమేశ్వర్‌, రాజశేఖర్‌, తిర్మలయ్య, ఎల్‌.రమేష్‌, అనిల్‌, నగేష్‌, బొర్ర సురేష్‌, డా.నాగయ్య, నరసింహా, వెంకట్రాములు, యాదగిరి, వినోద్‌, గిరి, దినేష్‌, టేకన్న, శేఖర్‌, శివ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 11:13 PM