సంక్రాంతి ముందస్తు సంబరాలు
ABN , Publish Date - Jan 10 , 2025 | 11:49 PM
అయిజ మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
అయిజటౌన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం ఆయా పాఠశాలల్లో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి మంటలు వేసి వాటి చుట్టూ విద్యార్థులు బొడ్డెమ్మ ఆడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.