గ్రామాల్లో సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:40 PM
మండలంలోని అన్ని గ్రామాలతో పాటు మండ ల కేంద్రంలో ఆదివారం రంగవల్లులు వేయడా నికి రంగుల దుకాణాలు పతంగులు ఎగరవే యడానికి గాలిపటాల దుకాణాలు సందడిగా మారాయి.

ఖిల్లాఘణపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అన్ని గ్రామాలతో పాటు మండ ల కేంద్రంలో ఆదివారం రంగవల్లులు వేయడా నికి రంగుల దుకాణాలు పతంగులు ఎగరవే యడానికి గాలిపటాల దుకాణాలు సందడిగా మారాయి. చిన్నారులు, యువకులు గాలిపటా లు ఎగరవేయడానికి వివిధ రకాల గాలిపటా లు, దారాలు మాంజాలు ఎంపిక చేసుకోవ డంలో, మహిళలు ఇంటి ముంగిట అందంగా ముగ్గులు అలంకరించడానికి రంగులను కొను గోలు చేయడంలో బిజీగా ఉంటూ దుకాణాల వద్ద సందడి చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని కనుల పండువగ చేసుకోవడానికి గ్రామాల్లోని ప్రజలు సిద్ధమయ్యారు.