జలాధివాసంలోనే సంగమేశ్వర ఆలయం
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:46 PM
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే సంగమేశ్వరుడి దర్శనం ఈ ఏడాది శివ భక్తులకు లేనట్టే.

- శివరాత్రి భక్తులకు సంగమేశ్వరుడి దర్శనం లేనట్లే
కొల్లాపూర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే సంగమేశ్వరుడి దర్శనం ఈ ఏడాది శివ భక్తులకు లేనట్టే. ప్రతీ ఏడాది మహాశివరాత్రిలోపే శ్రీశైలం తిరుగు జలాలు వెనక్కి తగ్గి సప్తనదుల సంగమ క్షేత్రం సంగమేశ్వర ఆల యం జలాధివాసం నుంచి బయటపడేది. కానీ ఈ ఏడాది మహా శివరాత్రి ఇంకా రెండు రోజులే ఉన్నా.. కేవలం ఆలయం సగభాగం మాత్రమే జలాధివాసం నుంచి బయటపడడంతో శివ భక్తులు ఆలయ గోపురం దర్శనం చేసుకుని పూజలు చేసుకునే పరిస్థితి నెల కొంది. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 849 అడుగులు, ఆలయంలో కి వెళ్లాలంటే 9 అడుగులు తగ్గాలి. గర్భాలయంలో వేపదార శివలిం గాన్ని దర్శనం కావాలంటే ఇంకా రెండు అడుగుల తగ్గాలి. మొత్తం 11 అడుగుల నీటి మట్టం తగ్గాలని ఆలయ పురోహితులు చెబుతు న్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల భక్తులకు సంగమేశ్వరుడి దర్శనం లేనట్లే అని అంటున్నారు.