Share News

సాందీపని సేవలు అభినందనీయం

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:18 PM

సందీపని 20 సంవత్సరాలుగా నిరంతరరంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ డీకే ఆరుణ అన్నారు.

సాందీపని సేవలు అభినందనీయం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎంపీ డీకే ఆరుణ

- ఎంపీ డీకే ఆరుణ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మార్చి, 5 (ఆంధ్రజ్యోతి) : సందీపని 20 సంవత్సరాలుగా నిరంతరరంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ డీకే ఆరుణ అన్నారు. బుధవారం బండమీదిపల్లిలోని సాందిపని సంస్థ 20వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లితండ్రులు లేని పిల్లలను చేరదీసి వారికి ఉన్నత విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో స్థిరపడేలా చేయడం నూతన సమాజ నిర్మాణం చేయడం లాంటిదన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సాందీపని అశ్రమం చిన్నపిల్లలకు చేస్తున్న సేవలు ఎంతో ఉన్నతమైనవన్నారు. సంస్థకు ఎప్పుడు ఏ సహయం కావాలన్న చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆవాసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ సుమలత, డాక్టర్‌ శ్రీనివాసరావు, వెంకట్‌రెడ్డి, కురుమయ్య, కాశీనాథ్‌, సాని ప్రసాద్‌, చిన్నయ్య, ఆంజనేయులు, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:18 PM