Share News

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:32 PM

వాహనాలు నడిపేటప్పుడు ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జిల్లా రవా ణా శాఖ అధికారి మానస అన్నారు.

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
సమావేశంలో మాట్లాడుతున్న సీఐ కృష్ణ

వనపర్తి క్రైమ్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : వాహనాలు నడిపేటప్పుడు ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జిల్లా రవా ణా శాఖ అధికారి మానస అన్నారు. నెల రో జులుగా రోడ్డు రవాణా, పోలీస్‌ శాఖల ఆధ్వ ర్యంలో జనవరి 1 నుంచి నిర్వహించిన జాతీ య రోడ్డు భద్రతా మాసోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు రోజున ప్రభుత్వ బాలు ర పాఠశాల మైదానం నుంచి ప్రభుత్వ పాలిటె క్నిక్‌ కళాశాల వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ.. ప్రమాదాల బారిన పడి కుటుంబ సభ్యులను కష్టాలపాలు చేయవద్దని సూచించారు. వాహనాలు నడిపేట ప్పుడు హెల్మెట్‌ ధరించడం, సీట్‌ బెల్టు వేసు కోవడం తప్పనిసరిగా పాటించాలన్నారు. అనం తరం సీఐ కృష్ణ మాట్లాడుతూ... పిల్లలపై చా లా గురుతర బాధ్యతలు ఉన్నాయని, వారి తల్లి దండ్రులు, అన్నదమ్ములతో సుఖ సంతోషాలతో ఉండాలంటే వారి పెద్దలకు రోడ్డు భద్రతపై చె ప్పాల్సిన అవసరం ఉందని అవగాహన కల్పిం చారు. వనపర్తి రూరల్‌ ఎస్‌ఐ జలంధర్‌ రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ సురేంద్ర, వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సై దులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:32 PM