Share News

ఆడపడుచుల కుటుంబాలకు పెద్దన్న రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:16 PM

పెళ్లికి వచ్చిన ఆడపడుచుల కుటుంబాలకు భారం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

ఆడపడుచుల కుటుంబాలకు పెద్దన్న రేవంత్‌రెడ్డి
మరికల్‌ మండలం కన్మనూర్‌ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శ్రీహరి

- సంక్షేమ పథకాల కోసం దళారులను ఆశ్రయించొద్దు

- అర్హులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మరికల్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి వచ్చిన ఆడపడుచుల కుటుంబాలకు భారం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మరికల్‌ మండలంలోని కన్మనూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐదు గ్రామాల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం ఎవరూ దళారులను ఆశ్రయించొద్దని సూచించా ు. అనంతరం పలువురు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఎర్ర దామోదర్‌రెడ్డి, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్‌, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అంతకుముందు కన్మనూర్‌లో జడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీహరి పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెచ్‌ఎం బాలనారాయణ, ఉపాధ్యాయులు ఉన్నారు.

చదువే భవిష్యత్‌కు బాటలు

నర్వ : చదువుతోనే భవిష్యత్‌ ముడిపడి ఉందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమ వారం నర్వ మండలం పాతర్‌చేడ్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఉదయం అల్పాహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పలు సమస్య లను ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తున్న దాత లంకాల కుర్వ మహేష్‌ను, విద్యార్థులందరికి వైట్‌ యూనిఫామ్‌లు వితరణ చేసిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు ఎస్‌.రాములు ను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. ఆ తర్వాత ఆయన ఉందేకోడ్‌ గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు నర్వ రైతు వేదికలో 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, 22 మందికి ఎల్‌వోసీలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మల్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, కాంగ్రెస్‌ నాయకుడు మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెన్న య్యసాగర్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

మక్తల్‌రూరల్‌ : మక్తల్‌ మునిసిపాలిటీలోని రజకవాడకు చెందిన ఆంజనేయులుకు సీఎం సహాయనిధి చెక్కును సోమవారం మక్తల్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రవికుమార్‌, ఎం.నాగరాజు ఉన్నారు. అలాగే, పారేవుల గ్రామానికి చెందిన మాల వెంకటప్పకు మంజూరైన రూ.75 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును కాంగ్రెస్‌ పార్టీ మాగనూరు మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, ఏఎంసీ డైరెక్టర్లు విష్ణువర్దన్‌రెడ్డి, ఫయాజ్‌లు అందజేశారు. గోవర్దన్‌ ఉన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 11:16 PM