ఆర్డీఎస్ రైతులు అధైర్య పడొద్దు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:29 PM
ఆర్డీఎస్ పరిధిలో పంట సాగు చేస్తున్న రైతులెవరూ అధైర్య పడొద్దని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు.

వడ్డేపల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : ఆర్డీఎస్ పరిధిలో పంట సాగు చేస్తున్న రైతులెవరూ అధైర్య పడొద్దని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. శని వారం ఆయన తుంగభద్ర, సుంకేసుల రిజర్వా యర్‌తో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి ఇన్‌ఫ్లోను పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 రోజులుగా అలంపూర్ నియో జకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుదారులు ఆర్డీ ఎస్‌కు నీరు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తుండటం ఎంతో బాధకలిగిస్తుందని తెలిపా రు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వర్షాభావ, సాంకేతి క, పరిపాలన కారణాల వల్ల సకాలంలో సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించి సుంకేసుల బ్యారేజ్, తుమ్మిళ్ల ఎత్తిపోతల సందర్శనకు వచ్చానని తెలిపారు. అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బీఆర్ ఎస్ నాయకులకు ఆర్డీఎస్‌పై అవగాహణ లేదని, ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వాలనే తపన తప్ప రైతులకు ఉన్న అనుమానాలు, అపోహాలను, సందేహాలను నివృత్తి చేయడంలో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. రైతులకు వాస్తవా లు తెలిపి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తాను ఇక్కడికి వచ్చానన్నారు. తాము వారం రోజుల క్రితం తుంగభద్రకు ఇండెంట్ పెట్టామని తెలి పారు. కాగా, 5.86 టీఎంసీ లకు గాను ఎన్నింటికి ఇం డెంట్ పెడితే రైతులకు న్యా యం జరుగుతుందో రెండు రాష్ర్టాల అధికారులకు తెలుసునని తెలిపారు. తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్‌తో ఆర్డీఎస్ రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదని, దశాబ్దా లుగా ఆనవాయితీగా వస్తు న్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ర్టాలు కలిపి ఇండెంట్ పెడితేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, కిసాన్‌సెల్ అధ్యక్షుడు నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్‌చైర్మన్ కుమార్, జిల్లా గ్రంథాల యం చైర్మన్ నీలి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.