నేడు ఉమ ్మడి మహబూబ్‌నగర్‌లో రథయాత్ర
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:33 PM
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుపరచుకోవ డానికి ఫిబ్రవరి ఏడో తేదీన చలో హైదరాబాద్‌కు డప్పు దరువులతో ప్రదర్శనకు రావా లని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గోనిపాటి కళ్యాన్‌మా దిగ పిలుపునిచ్చారు.

- ఫిబ్రవరి ఏడున చలో హైదరాబాద్
- డప్పు దరువులతో ప్రదర్శనకు రావాలి
- ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గోనిపాటి కళ్యాన్‌మాదిగ
నారాయణపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుపరచుకోవ డానికి ఫిబ్రవరి ఏడో తేదీన చలో హైదరాబాద్‌కు డప్పు దరువులతో ప్రదర్శనకు రావా లని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గోనిపాటి కళ్యాన్‌మా దిగ పిలుపునిచ్చారు. సోమ వారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసు కువస్తానని చెప్పి ఐదు నెలలు గడుస్తున్నా వర్గీకరణ అమలు కావడం లేదని విమర్శించారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో వెయ్యి గొంతుకలతో లక్ష డప్పుల కళామండలి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. వెంక టయ్య, చంటి, రమేష్, కృష్ణ, రవి, మాధవ్, హనుమంతు, నరేందర్, తాయప్ప ఉన్నారు.