Share News

కులమతాలకు ప్రతీక రంగాపూర్‌ ఉర్సు

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:06 PM

నా గర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌ హజ్రత్‌ నిరంజన్‌ షావలీ దర్గా ఉత్సవాలు శని వారం అట్టహాసంగా జరిగాయి.

 కులమతాలకు ప్రతీక రంగాపూర్‌ ఉర్సు
భక్తులతో రద్దీగా మారిన రంగాపూర్‌ దర్గా

- రంగాపూర్‌ దర్గాలో మొక్కులు తీర్చుకున్న భక్తులు

- విచ్చల విడిగా మద్యం అమ్మకాలు - చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

అచ్చంపేటటౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): నా గర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌ హజ్రత్‌ నిరంజన్‌ షావలీ దర్గా ఉత్సవాలు శని వారం అట్టహాసంగా జరిగాయి. కుల, మతాలకతీ తంగా రంగాపూర్‌ ఉర్సు నిదర్శనమన్నారు. ఈ జా తరకు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. హిందూ ముస్లింలు నిరంజన్‌ షావలీ దర్గాను ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్శిం చుకొని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలో అతి పెద్ద జాతరగా పేరొందిన రంగాపూర్‌ ఉర్సులో మ ద్యం విక్రయాలు తాండవిస్తున్నాయి. ఒకే ఊరు అయిన అధికారులు రెండు గ్రామపంచాయతీలుగా విడదీసిన రంగాపూర్‌ జాతరలో మాత్రం సిండికేట్‌ గా మారి అందినకాడికల్ల దోచేసుకుంటున్నారన్న వి మర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఏటా జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే జాతర దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఏడాది తైబజారు లేక పోవడంతో ఎవరి రాజ్యం వారిదే అన్నట్టుగా ఉన్న ట్లు తెలుస్తున్నది. జాతరను అదునుగా చూసుకొని కొబ్బరికాయలు ఏకంగా రూ. 50 లకు వి క్రయిస్తున్నారు. .

Updated Date - Jan 18 , 2025 | 11:06 PM