Share News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:44 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో గోవిందరాజులు అన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో గోవిందరాజులు

- డీఈవో గోవిందరాజులు

దామరగిద్ద, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉ న్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అన్ని తరగతి గదులు తి రుగుతూ బోధనా అంశాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి 10/10 మార్కులు తెచ్చుకోవాలని సూ చించారు. విద్యార్థులకు స్నాక్స్‌ అందుతున్నా యా, లేదా అడిగి తెలుసుకున్నారు. సెక్టోరియల్‌ అఽధికారి శ్రీనివాస్‌, జీహెచ్‌ఎం అశోక్‌, ఉపాధ్యా యులు శంబులింగం, మల్లికార్జున్‌, కనకప్ప, అ మృత, తిప్పన్న ఉన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:44 PM