విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:56 PM
ప్రతీ రోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్ అన్నారు.

- ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్
- బిజ్వార్ జడ్పీహెచ్‌ఎస్ తనిఖీ
ఊట్కూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రతీ రోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనానికి చెందిన బియ్యం స్టాక్, నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులు, ఇతర ఎలాంటి సమ స్యలు లేకుండా చూడాలన్నారు. అనంతరం వం ట గదితో పాటు తరగతి గదులను పరిశీలించారు. అలాగే రికార్డులను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు కిశోర్‌కుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.