సమస్యల పరిష్కారం కోసమే పీఆర్టీయూ
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:29 PM
ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసమే పీఆర్టీయూ పుట్టిందని ఆ సంఘం జిల్లా ప్రఽధాన కార్యదర్శి జి.సుధాకర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు బుచ్చారెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసమే పీఆర్టీయూ పుట్టిందని ఆ సంఘం జిల్లా ప్రఽధాన కార్యదర్శి జి.సుధాకర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు బుచ్చారెడ్డి అన్నారు. పీఆర్టీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో వారు జెండా ఆవిష్కరించి, మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం 53 ఏళ్ల కిందట ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి ఎన్నో పెండింగ్ సమస్యలు పరిష్కరించిందన్నారు. ఈ సందర్భంగా మహమ్మదాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందిన టీచర్లకు సర్వీస్ పుస్తకాలు అందజేశారు. అనంతరం పీఆర్టీయూ సంఘాలనికి సేవలు అందించిన మాజీ జిల్లా అధ్యక్షుడు గట్టు వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు శంకరయ్య, రాములు, ఆంజనేయులు, అశోక్‌కుమార్‌రెడ్డి, లక్ష్మి, వెంకట్‌రెడ్డి, సునంద, నరసింహరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు తిమ్మారెడ్డి, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌నాయక్, అక్తర్ అహ్మద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి అశ్వని చంద్రశేఖర్, ఎల్లయ్య, పురుషోత్తం, కవిత, వైవీ రావు, విజయానంద్‌రెడ్డి పాల్గొన్నారు.