సర్వమత ప్రార్థనలతో నిరసన
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:01 AM
స మగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 25వ రోజు శుక్రవారం దీక్షా శిబి రంలో సర్వమత ప్రార్థనలు నిర్వ హించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

- సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల వినూత్న నిరసన
గద్వాల టౌన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం సమ్మె కొనసాగిస్తున్న స మగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 25వ రోజు శుక్రవారం దీక్షా శిబి రంలో సర్వమత ప్రార్థనలు నిర్వ హించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తమపై కనికరం కలిగి ఉద్యోగాలను క్రమబద్ధీక రించేలా చూడాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రార్థనల్లో వేడుకున్నట్లు తెలిపారు. కాగా, దీక్ష శిబిరాన్ని సందర్శించిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత ఉద్యోగులు సాగిస్తున్న న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉన్న నేపథ్యంలో త్వరలోనే సమ స్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సమ్మెలో గద్వాల అర్బన్ రెసి డెన్షియల్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ శేషన్న, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు శ్రీదేవి, పద్మావతి, గోమతి, చెన్నబసమ్మ, విజ యలక్ష్మి, పద్మ, చం ద్రకళ, పరిమళ, కృష్ణవేణి, అనురాధ, ఆసియా బేగం సీఆర్‌టీలు, టీజీసీఆర్‌టీలు, నాన్ టీచింగ్ స్టాఫ్, మహిళా అధ్యక్షురాలు ప్రణీత, వివిధ విభాగాల అధ్యక్షులు రామాంజనేయులు, శ్రీధర్, అల్తాఫ్, ఎంఏ సమి, మురళి, రాజేందర్ తది తరులు ఉన్నారు.