Share News

ప్రియాంకాగాంధీజీ.. స్కూటీ హామీ ఏమైంది?

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:38 PM

ప్రియాంకా గాంధీజీ.. శాసనసభ ఎన్నికల సం దర్భంగా 2023 మే 23వ తేదీన సరూర్‌నగర్‌ స్టేడియంలో ఇచ్చిన ఉచిత స్కూటీల హామీ ఏమైందని ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థినులు ప్రశ్నించారు.

ప్రియాంకాగాంధీజీ.. స్కూటీ హామీ ఏమైంది?

విద్యార్థినుల పోస్టుకార్డు ఉద్యమం

వడ్డేపల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రియాంకా గాంధీజీ.. శాసనసభ ఎన్నికల సం దర్భంగా 2023 మే 23వ తేదీన సరూర్‌నగర్‌ స్టేడియంలో ఇచ్చిన ఉచిత స్కూటీల హామీ ఏమైందని ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థినులు ప్రశ్నించారు. హామీలను విస్మరించిన నాయకు ల తీరును నిరసిస్తూ శనివారం శాంతినగర్‌ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పోస్టు కార్డు ల ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళల కు ప్రభుత్వ పరంగా ఆలంబన అనే నినాదాల తో యూత్‌ డిక్లరేషన్‌ పేరిట ఇచ్చిన ఉచిత స్కూటీలను ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాల న్నారు. 18ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి ఉచిత ఎలక్ర్టిక్‌ స్కూటీపంపిణీ, మహిళలకు రూ.2,500 నెలసరి ఆర్థిక సహాయం హమీలను ఎప్పుడు నెరవేరుస్తారన్నారు. కాంగ్రెస్‌ అగ్రనాయకులు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ఉద్య మం కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థినుల కు హక్కుగా రావాల్సిన ఉచిత స్కూటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సాధించు కుంటామన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:38 PM