Share News

నియంతలా పరిపాలిస్తున్న ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:39 PM

దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు అందించి అభివృద్ధిపర్చాలని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రధాని నరేంద్రమోదీ కాలరాస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కుంభం శివకు మార్‌రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియంతలా పరిపాలిస్తున్న ప్రధాని మోదీ
పేటలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష తగదు

- డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి

- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

- కాంగ్రెస్‌ భారీ ర్యాలీ

నారాయణపేట, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు అందించి అభివృద్ధిపర్చాలని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రధాని నరేంద్రమోదీ కాలరాస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కుంభం శివకు మార్‌రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు నిధులు ఇవ్వకుండా ప్రధాని కక్షపూరితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పా ర్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్ట ణంలోని సీవీఆర్‌ బంగ్లా నుంచి చిట్టెం నర్సిరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌కుమార్‌రెడి, కుంభం శివకు మార్‌రెడ్డిలు ప్రసంగించారు. ముగ్గురు, నలు గురు ఎంపీలు ఉన్న ఆంధ్ర, బీహార్‌లకు వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయిస్తే రాష్ట్రం లో ఎనిమిది మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న కూడా తెలంగాణకు వచ్చింది మాత్రం గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి అఽధిక మొత్తంలో పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్నా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్ర నిధులు కేటాయించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే మోదీ మెడలు వంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నకుమారి, నాయకులు శివకుమార్‌, బండి వేణుగోపాల్‌, స రాఫ్‌ నాగరాజ్‌, కోనంగేరి హన్మంతు, కోట్ట రవీందర్‌రెడ్డి, కాంత్‌కుమార్‌, శరణప్ప, మహేష్‌, మనోహర్‌గౌడ్‌, వకీల్‌ సంతోష్‌కుమార్‌, ఎండీ.సలీం, కుర్వమనోజ్‌, సాయిబాబ తదితరులున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:39 PM