Share News

చర్యలకు రంగం సిద్ధం

ABN , Publish Date - Feb 22 , 2025 | 11:29 PM

రాజాపూర్‌ కస్తూర్బాగాంఽధీ విద్యాలయంలో విద్యార్థులను కొందరు సీఆర్టీలు దూషించిన ఘటనపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలిసింది. ఈ మేరకు కేజీబీవీ ఎస్‌వో పావని దేవరకద్రకు బదిలీ కాగా, సీఆర్టీ మంజుల మిడ్జిల్‌కు, మరో సీఆర్టీ సుకీర్తి చిన్నచింతకుంటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాజాపూర్‌ మండల విద్యాధికారి శనివారం విలేకరులకు తెలిపారు.

చర్యలకు రంగం సిద్ధం

- రాజాపూర్‌ కేజీబీవీలో జరిగిన ఘటనపై మరోసారి విచారణ

- ముగ్గురు అధికారులతో కమిటీ

- ఎస్‌వోతో పాటు ఇద్దరు సీఆర్టీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాజాపూర్‌ కస్తూర్బాగాంఽధీ విద్యాలయంలో విద్యార్థులను కొందరు సీఆర్టీలు దూషించిన ఘటనపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలిసింది. ఈ మేరకు కేజీబీవీ ఎస్‌వో పావని దేవరకద్రకు బదిలీ కాగా, సీఆర్టీ మంజుల మిడ్జిల్‌కు, మరో సీఆర్టీ సుకీర్తి చిన్నచింతకుంటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాజాపూర్‌ మండల విద్యాధికారి శనివారం విలేకరులకు తెలిపారు. ఇదిలా ఉంటే, విద్యార్థులను ఓ సీఆర్టీ కులంపేరుతో దూషించిన ఘటనపై మరోమారు విచారణ చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు సమా చారం. విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి పూర్తి వివరాలు తీసుకోనున్నా రు. మొత్తంగా రాజాపూర్‌ కేజీబీవీలో జరిగిన ఘటన విద్యాశాఖలో కల కలం రేపుతోంది. కేజీబీవీ విద్యార్థులకు మంచి విద్యనందించాల్సిన ఉపాధ్యా యులు వారి మధ్య నెలకొన్న ఆఽధిపత్య పోరుతో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. విద్యార్థులే బాహాటంగా ఓ సీఆర్టీ తనను కులం పేరుతో దూషించారని, తను చెట్లకు నీరు పోస్తే అవి ఎండిపోతాయని అనడం ఈ విషయాన్ని విద్యార్థులు మీడియా ముందు చెప్పడం గమనార్హం. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం సీఆర్టీలపై తీవ్రమైన ఆరోప ణలకు దారి తీస్తోంది.

Updated Date - Feb 22 , 2025 | 11:29 PM