భక్తిశ్రద్ధలతో ప్రభోత్సవం
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:11 AM
నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం గ్రామంలో లక్ష్మీనరసిం హస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసా గుతున్నాయి.

- పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు
- నేడు రథోత్సవం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి
కొల్లాపూర్ ,జనవరి16 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం గ్రామంలో లక్ష్మీనరసిం హస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసా గుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువా రం రాత్రి ప్రభోత్సవం నిర్వహించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ వ్యవ స్థాపకుడు, ట్రస్టు చైర్మన్ ఎస్‌వీకేకే ఆదిత్య లక్ష్మారావు హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి రత్నగిరి కొండ సమీపంలోని జమ్మి చెట్టు వరకు ఊరే గింపు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన సింగోటం క్షేత్రాన్ని సందర్శించారు. శుక్రవారం సాయం త్రం నిర్వహించనున్న రథోత్సవానికి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అసౌ కర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను ఆదేశించారు. పక్కనే ఉన్న శ్రీవారి సముద్రం చెరువు కట్టను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశిం చారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన లక్ష్మీ నరసింహస్వామి నృత్య రూపకాన్ని తిలకించారు. చిన్నారి కళాకారులను అభినందించి సత్కరించారు.