Share News

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:28 PM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధం లేకుండా బీఆర్‌యస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి తమ సత్తాచాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

స్థానిక ఎన్నికల్లో  సత్తా చాటాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మూసాపేట,ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధం లేకుండా బీఆర్‌యస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి తమ సత్తాచాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని జానంపేట నిర్వహించిన బీఆర్‌యస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం నిరాశ నిసృహాతకు గురికాకుండా స్థానిక ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఽధైర్యంగా పోటిపడటానికి సిద్దంగా ఉండాలన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడచిన అమలు కాని హమీలు ఇచ్చి ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి పూర్తి చేయకుండా గ్రామసభలు, అప్లికేషన్‌లు అంటూ కాలయాపన చేస్తు ప్రజలను మోసం చేస్తోందన్నారు.సర్పంచిల పదవి కాలం ముగిసి ఏడాది కాలం గడిచిన ఇప్పటికి గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందన్నారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చేబుతారన్నారు.తమ ప్రభుత్వ హయంలో చేసిన అభివృద్ది పనులకే శిలఫలకాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని...కాంగ్రెస్‌ వచ్చాక కొత్తగా చేసింది ఏమిలేదని ఆరోపించారు.ఈ సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు గడ్డమీది ఇంద్రయ్యసాగర్‌, బీఆర్‌యస్‌ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మినర్సింహాయాదవ్‌, సింగిల్‌ విండో అధ్యక్షులు బండ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గూపని కళావతి, మాజీ మార్కెట్‌ కమిటి ఉపాధ్యక్షులు పల్లి శివరాములు, మాజీ సర్పంచిలు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నక్క ఆంజనేయులు, మండల నాయకులు మదిన జమీర్‌, నక్క మల్లయ్యయాదవ్‌, నర్సింహులుగౌడ్‌, రవిందర్‌గౌడ్‌, ప్రకాశ్‌రెడ్డి, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:28 PM