పేద కుటుంబాలు బాగుండాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:19 PM
పేద కుటుంబాలు అన్ని రకాలుగా బాగుం డాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
- గృహ ప్రవేశం చేసిన 240 మంది లబ్ధిదారులు
కల్వకుర్తి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : పేద కుటుంబాలు అన్ని రకాలుగా బాగుం డాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని తెలి పారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో 240 మంది డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు బుధవారం సాయంత్రం గృహ ప్రవేశం చేశారు. ముందుగా ఎమ్మెల్యే వారికి ఇంటి తాళం చెవులు, పట్టాలను అందిం చారు. అనంతరం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే కల్వకుర్తిలో 240 డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 13 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు అసంపూర్తిగా మిగిలాయ ని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే 2.50కోట్లు మంజూరు చేసి, అసంపూర్తి పనులను పూర్తి చేయించినట్లు చెప్పారు. డబుల్‌బెడ్రూం ఇళ్లల్లో విద్యుత్ మీటర్ల ను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం లో డ్రైనేజీలు, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ. 500 కోట్లు మంజూరు చేయిం చినట్లు తెలిపారు. అనంతరం మార్చాల గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు ఠాకూర్ బాలాజీసింగ్, తహసీల్దార్ ఇబ్రహీం, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజు కుమార్, నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, యెన్నం భూపతిరెడ్డి, పసుల రాజేశ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాని, ఎజాస్, రవి, రేష్మ, శ్రీనివాసులు, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.