సీఎంను కలిసిన పేట ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:12 PM
నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు.

నారాయణపేట టౌన్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మార్పులు, చేర్పులు చేయడం వలన రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ధన్వాడ, కోయిల్‌కొండ మండలాల్లో డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు మంజూరు చేయాలని, ధన్వాడ డబుల్ లైన్ రోడ్డు పనులు చేపట్టాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ పేట మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ఉన్నారు.