Share News

సాఫీగా సాగుతున్న పేట, కొడంగల్‌ సర్వే పనులు

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:09 PM

మండల పరిధిలోని దామరగిద్దతండా శివారులో నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పనులకు సంబంధించిన సర్వే పనులు శనివారం సాఫీగా కొనసాగాయి.

సాఫీగా సాగుతున్న పేట, కొడంగల్‌ సర్వే పనులు
జయమ్మ చెరువు వద్ద భూములు పరిశీలిస్తున్న డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి

- భూములను పరిశీలించిన డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి

దామరగిద్ద, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని దామరగిద్దతండా శివారులో నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పనులకు సంబంధించిన సర్వే పనులు శనివారం సాఫీగా కొనసాగాయి. పంప్‌హౌస్‌ నిర్మాణం, విద్యుత్‌ ఉపకేంద్ర నిర్మాణం, నిర్వహణ కార్యాలయం కోసం అవసరమైన భూములను అధికారులు సర్వే చేశారు. శనివారం డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి జయమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లో సర్వే చేపట్టి భూములను పరిశీలించారు. అనంతరం తండా రై తులతో సమావేశమై, మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఎవరు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. రైతులకు నష్టం కలిగించకుండా చూసు కునే బాధ్యత మాపై ఉందన్నారు. విండో చైర్మన్‌ పుట్టి ఈదప్ప, శ్రీనివాస్‌, ఎంపీటీసీ మాజీ సభ్యులు శేఖర్‌, గోపాల్‌నాయక్‌ ఉన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:09 PM