గడువులోగా అనుమతులు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 28 , 2025 | 11:23 PM
జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహిస్తూ టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయాల్సిన అనుమతులను నిబంధనల మేరకు గడువులోగా మంజూరు చేయాని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహిస్తూ టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయాల్సిన అనుమతులను నిబంధనల మేరకు గడువులోగా మంజూరు చేయాని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. టీ ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్ కులాల వారికి ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వాహనాలు ఆరు గురికి, షెడ్యూల్ తెగల వారికి 17 మందికి ట్రాక్టర్ అండ్ ట్రైలర్స్‌కు, మారుతి డిజైర్, ఇతర వాహనాలకు పెట్టుబడి సబ్సిడీ, మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు. జిల్లా పరిశ్రమల జనరల్ మానేజర్ ప్రతాప్‌రెడ్డి. ఎల్‌డీఎం కాల్వ భాస్కర్, భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
నవాబ్‌పేట : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని, వంట పాత్రలు శుభ్రంగా ఉంచాలన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు నాణ్యమైనవి అందించాలని కోరారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగి వివరాలు నమోదు చేసుకోవాలని, సిబ్బంది సమయపాలన పాటించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో జయరాములు, డీటీ గాయత్రి, ఆర్‌ఐ కిరణ్ ఉన్నారు.