Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:39 PM

క్రీడలు మా నసిక ఉల్లాసాన్నిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అ న్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
బాస్కెట్‌బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

- పశుబల ప్రదర్శన, బాస్కెట్‌ బాల్‌ పోటీలను ప్రారంభించిన చిన్నారెడ్డి

అయిజ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):క్రీడలు మా నసిక ఉల్లాసాన్నిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అ న్నారు. జోగుళాంబ గద్వా ల జిల్లా అయిజ మండలం లోని ఉత్తనూర్‌ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వ హిస్తున్న జాతీయ స్థాయి క్రీడాపోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మా ట్లాడారు. ముందుగా నాలు గు పళ్ల సైజు విభాగంలో పోటీలు ప్రారంభించారు. పశుబలప్రదర్శన పోటీలకు 25 జతలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభించారు. ఇందులో ఉమెన్‌ విభాగం నుంచి 5, మెన్‌ విభాగం నుంచి 14 టీములు తలపడనున్నాయి. క్రీడా పోటీలు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడలు వివిధ ప్రాంతాల వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు పెంచుతాయని గుర్తు చేశారు.

Updated Date - Feb 03 , 2025 | 11:39 PM