క్రీడలతో మానసికోల్లాసం
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:05 PM
క్రీడలతో శారీరక దారుడ్యంతో పాటు, మానసికోల్లాసాన్ని పొందవచ్చని పేట డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్‌లు అన్నారు.

- డీఎస్పీ లింగయ్య
నారాయణపేటరూరల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో శారీరక దారుడ్యంతో పాటు, మానసికోల్లాసాన్ని పొందవచ్చని పేట డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్‌లు అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకుని మండలంలోని అభంగాపూర్ గ్రామంలో గ్రామ యువకులు ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను వారు ప్రారంభించి, మాట్లాడారు. వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానందుడిని యువకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు నర్సిములు, మాజీ సర్పంచ్ విక్రంగారి వర్ష, భగవంతు, లక్ష్మీకాంత్, రాములు, రమేశ్, చెన్నప్పలు పాల్గొన్నారు. అదేవిధంగా, మండలంలోని జాజాపూర్ గ్రామంలో జరుగుతున్న జీపీఎల్ క్రికెట్ పోటీలను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మన్నెసురేష్, అలుగడ్డ రవికుమార్, వెంకటేశ్, లక్షక్ష్మణ్, హరీష్‌గౌడ్, శివకుమార్‌గౌడ్ తదితరులున్నారు.