Share News

ఫుడ్‌ పాయిజన్‌పై పార్టీల ఆందోళన

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:46 PM

ధన్వాడ బాలుర పాఠశాలలో జరిగిన సంఘటనపై గురు వారం ధన్వాడలో లొల్లి... లొల్లి చోటుచేసుకుంది.

ఫుడ్‌ పాయిజన్‌పై పార్టీల ఆందోళన
ధన్వాడలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ, ఏబీవీపీ నాయకులు

ధన్వాడ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ధన్వాడ బాలుర పాఠశాలలో జరిగిన సంఘటనపై గురు వారం ధన్వాడలో లొల్లి... లొల్లి చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలో పోలీస్‌ బందో బస్తును నిర్వహించారు. ఫుడ్‌ పాయిజన్‌పై చ ర్యలు తీసుకోవాలంటూ బీజేపీ, ఏబీవీపీ ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని విమర్శించారు. గంట పాటుగా రోడ్డుపై భైఠాయింపు జరి పారు. రాస్తారోకో విరమించాలని ఎస్‌ఐ రమేష్‌ ఆందోళనకారులను కోరడంతో కొద్ది సేపు ఎస్‌ఐ తో వాగ్వాదం చోటుచేసుకుంది. పాఠశాలలో మ ధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నా రు. ఫుడ్‌ పాయిజన్‌ ఎలా జరిగిందని బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యా యులు నర్సింహ్మచారిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంపై పాఠశాలలో గొడవ చోటుచేసుకోవడంతో ఎస్‌ఐ రమేష్‌, పోలీసులు సముదాయించారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఫుడ్‌ పాయిజన్‌పై నిరసన తెలిపా రు. పాఠశాలను సందర్శించి ఫుడ్‌ పాయిజన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఎంపీడీవో సాయిప్రకాష్‌, తహసీల్దార్‌ సింధూజ, ఎంఈవో గాయత్రిలను బీఆర్‌ఎస్‌ నాయకులు ని లదీశారు. అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్ర శ్నించారు. అక్కడే ఉన్న ఓ విద్యార్థి పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి అధికారులు, బీఆర్‌ ఎస్‌ నాయకులకు వివరించారు. తాగటానికి నీ ళ్లు సైతం ఉండవని విద్యార్థి అధికారులతో వా పోయారు. ఓ విద్యార్థి తన బాధను వ్యక్తం చేస్తే అధికా రులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ బీ ఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు.

Updated Date - Jan 30 , 2025 | 11:46 PM