లారీ, కారు ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:17 PM
డ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లి శివారులోని గురుకుల పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొన్న కారు
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన భార్య
భర్త కాలుకు తీవ్ర గాయాలు
జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
జడ్చర్ల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లి శివారులోని గురుకుల పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్ పట్టణానికి చెందిన భార్యాభర్తలు పురుషోత్తంరావు, విజయలక్ష్మీ(55) ఆదివారం సాయంత్రం జడ్చర్ల నుంచి కొత్తకోటకు కారులో వెళ్తన్నారు. చిట్టబోయిన్‌పల్లి సమీపంలో ముందుగా వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ, సడన్‌గా బ్రేక్ వేశాడు. దాంతో వెనుక ఉన్న కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. పురుషోత్తంరావు కాలుకు తీవ్ర గాయం అయ్యింది. దాంతో చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పురుషోత్తంరావు కుమారుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.