టీచర్ల బదిలీల్లో పాత పద్దతేనా?
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:16 PM
ఉపాధ్యాయులు స్పౌజ్ బదిలీల కోసం రెండురోజులుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

- రాత్రి పొద్దుపోయాక ప్రారంభమైన స్పౌజ్ టీచర్ల కౌన్సిలింగ్
- రాత్రి 9.40 గంటలకు పోస్టుపోన్ వేస్తున్నట్లు ప్రకటన
మహబూబ్‌నగర్ విద్యావిభాగం జనవరి 25 (ఆంద్రజ్యోతి ) : ఉపాధ్యాయులు స్పౌజ్ బదిలీల కోసం రెండురోజులుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి జిల్లాలో మ్యానువల్ పద్ధతిలో జరిగే సమయంలో ఉపాధ్యాయ బదిలీలు రాత్రి పొద్దుపోయాక ప్రారంభమై.. తెల్లవారుజాము వరకు జరివేవి. ఇప్పుడు కూడా స్పౌజ్ బదిలీకి సంబంధించిన ప్రక్రియ మళ్లీ పాత అదే పద్థతిన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జీవో 317లో నష్టపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను ఒకే జిల్లాకు తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వివరాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసి నాలుగు రోజులైనా జిల్లాలో మాత్రం బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదు. వివిధ జిల్లాల నుంచి 113 మంది ఉపాధ్యాయులు రావడం బదిలీ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. జిల్లాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ స్పౌజ్ ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే లేదా అదే మండలంలో పోస్టింగ్ ఇవ్వాలన్న జిల్లా ఉన్నతాధికారుల సూచన మేరకు అందుకు సంబంధించిన జాబితాను విద్యాశాఖ అధికారులు శుక్రవారం సిద్ధం చేసినా.. అందులో కొన్ని ఇబ్బందులు రావడంతో శనివారం మళ్లీ తప్పులు సరిచేశారు. ఇందుకు సంబంధించి తమకు కోరుకున్న దగ్గరే పోస్టింగు కోసం కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో అధికారులపై ఒత్తిడి తీసుకరాగా, మరి కొందరు ఎమ్మెల్యే, మంత్రులతో సిపారస్సు లేఖలు ఇప్పించినట్లు సమచారం. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా ఇతర జిల్లాల్లో స్పౌజ్ బదిలీ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది.
శుక్రవారం నుంచి పడిగాపులు..
స్పౌజ్ బదిలీల కోసం వివిధ జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెల కొంది. శనివారం ఉదయం 10.30 గంటలకు మె ట్టుగడ్డలో గల ఆర్వీయం మీటింగ్ హాల్‌లో ఉం టుందని సంబంధిత ఉపాధ్యాయులు హాజరుకా వాలని డీఈవో తెలిపారు. కానీ ఉపాధ్యాయులు 10.30 గంటల నుంచి అక్కడ వేచి చూడగా, ఏడీ అనురాధ ఆధ్వర్యంలో అఽధికారులు ఉపా ధ్యాయుల సర్వీస్ బుక్కులు పరిశీలించి, వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ రాత్రి 8:00 వరకు ఖాళీల జాబితా, సీనియార్టీ జాబితా ఇవ్వకపోవడంపై ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. చివరకు రాత్రి 9.40కి ఇప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించడం లేదని ఆదివారం మధ్యాహ్నం నిర్వహిస్తామని చెప్పడంతో వారు మండీపడ్డారు. ఆంధ్రజ్యోతి డీఈవో ప్రవీణ్ కుమార్‌ను ఫోన్ ద్వారా వివరణ అడగగా జాబి తా ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆదివారానికి వాయిదా వేయినట్లు తెలిపారు.