Share News

అభివృద్ధికి వ్యతిరేకం కాదు

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:48 PM

వనపర్తి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదని, అభివృద్ధి ముసుగులో జరిగే అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.

అభివృద్ధికి వ్యతిరేకం కాదు
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

- అభివృద్ధి ముసుగులో జరిగే అవినీతికి వ్యతిరేకం

- అవినీతిపరుడు, అహంకారి నిరంజన్‌రెడ్డితో నాకేంపని

- రూపాయికి చెల్లని నాయకులు నాపై విమర్శలు చేస్తారా

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తి అర్బన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదని, అభివృద్ధి ముసుగులో జరిగే అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివా రం వనపర్తి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోపాల్‌పేటలో శనివారం మార్కెట్‌ యార్డు విషయంలో నేను వ్యతిరేకించింది మండ ల అభివృద్ధి కోసమేనని అన్నారు. మండల కేంద్రంలో మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేయడం వలన ఆ ప్రాంతం అభివృద్ధితో పాటు పలువురికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఒక స్వార్థపరుడి కోసం మార్కెట్‌ యార్డును ఊరి బయట నిర్మించడం సరి కాదన్నారు. కొందరు చిల్లర నాయకులు శవాల మీద డబ్బులు ఏరుకునే వారు నా గురించి మాట్లాడుతారా అని మండిపడ్డారు. 45 ఏళ్లలో గోపాల్‌పేట మండలాన్ని అభివృద్ధి చేసింది తానేనని, ఆ మండలంలో చేసిన అభివృద్ధిలో నా పాత్రనే కీలకంగా ఉందన్నారు. మోజర్లలో కూడా పదివేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన గోదాం విషయంలో కూడా అక్కడి ప్రజలు వ్యతిరేకించారన్నారు. దళితుల భూముల్లో గోదాం నిర్మాణానికి వెళ్తే తన్ని పంపించడంతో ఉద్యాన కళాశాలలో గోదాం నిర్మాణా నికి మంత్రితో శంకుస్థాపన చేయించారని విమర్శించారు. మూడు పార్టీలు మారిన నీవు నాపై ఆరోపణలు చేస్తావా అని ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మండిపడ్డారు. 45 ఏళ్లు రాజకీయంలో ఉన్నానని, మచ్చ లేకుండా దేశంలోనే నీతి, నిజాయితీ గల నాయకు లలో తాను ఒకరినని తెలిపారు. అవినీతిపరుడు, అహంకారి అయిన నిరంజన్‌రెడ్డితో నాకేం పని అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న పనుల వివరాల కోసం నా పీఏ భాస్కర్‌ను పంపి ఫైల్స్‌ తెప్పించుకున్నానే తప్పా అతనితో రోజు మా ట్లాడాల్సిన అవసరం నాకేముందన్నారు. తాను మద్దతు తెలిపినందుకే మేఘారెడ్డికి 25వేల ఓట్లు పడ్డాయని అన్నారు. మేఘారెడ్డికి సొంతంగా ఓటు బ్యాంకు ఎక్క డుందని ప్రశ్నించారు. పూటకు ఓ పార్టీ మారే నీవు, రేపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలో లేకపోతే బీజేపీలోకి, మరో పార్టీలోకి వెళ్తావని మేఘారెడ్డిపై మండిపడ్డారు.

Updated Date - Feb 23 , 2025 | 11:48 PM