Share News

జిల్లా కోర్టులో నూతన సంవత్సర వేడుకలు

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:22 PM

నూతన సంవత్సరంలో న్యాయవాదులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి బి పాపిరెడ్డి అన్నారు.

జిల్లా కోర్టులో నూతన సంవత్సర వేడుకలు
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి పాపిరెడ్డి

మహ బూబ్‌నగర్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : నూతన సంవత్సరంలో న్యాయవాదులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి బి పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులో గురువారం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రెడ్డి, రాంనాథ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు విధుల పట్ల అంకితభావంతో ఉండాలని కోరారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని, న్యాయవాదులు న్యాయమూర్తులకు అందిస్తున్న సహకారం ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. న్యాయమూర్తులు రాధిక, శారదాదేవి, ఆర్‌ శ్రీదేవి, మమతారెడ్డి, నిహారిక జుటుర్‌, రవిశంకర్‌, మునవర్‌ హుస్సేన్‌, న్యాయసేవాధికారం సంస్థ కార్యదర్శి ఇందిర పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:22 PM