నూతన మండలాలను ఏర్పాటు చేయాల్సిందే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:46 PM
జిల్లా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసౌలభ్యం కోసం జిల్లాలో నూతన మండలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష నాయకుల ధర్నా
గద్వాల న్యూటౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసౌలభ్యం కోసం జిల్లాలో నూతన మండలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు మా ట్లాడుతూ.. జిల్లాలోని పూడూరు, ఉప్పేరు, బి జ్వారం లేదా ఎల్కూరు, ఆలూరు, బలిగెర, మా చర్ల, మిడిదొడ్డి, చాగాదాణ, నందిన్నె, మేడికొండ, వెంకటాపురం గ్రామాలను మండలాలుగా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, అతికూర్ రహిమాన్, ప్రభాకర్, అంజనేయులు, వీవీ నర్సింహ, నర్మద, పూడురు చిన్నయ్య, రాఘవేంద్ర, అచ్చన్నగౌడు, టవర్ మక్బూల్, మోహన్‌రావు, గ్రామస్థులు పాల్గొన్నారు.