నారసింహ.. శరణు.. శరణు..
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:07 PM
ప్రపంచంలో ఎ క్కడా లేని విధంగా ఆలయం ఒక పేరుతో ప్రసిద్ధి చెంది మరొక రూపంలో దేవుడు దర్శనమిస్తూ భక్తులను కట్టిపడేస్తుం ది ఆ క్షేత్రం. భయాలను పారద్రోలి వరాల నొసిగే కల్పతరువు గా వాసికెక్కాడు అక్కడున్న దేవదేవుడు.. ఆ పావన ప్రదేశ మే సింగోటం. లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు స మయం ఆసన్నమైంది. సంక్రాంతి పర్వదినాన జాతరకు అంకురార్పణ కానుంది.

- 14 నుంచి ప్రారంభం కానున్న సింగోటం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- భక్తులకు లింగాకారంలో దర్శనమిస్తున్న లక్ష్మీ నరసింహుడు
- ఈనెల 17న సింగోటం జాతర షిడే మహోత్సవం
కొల్లాపూర్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో ఎ క్కడా లేని విధంగా ఆలయం ఒక పేరుతో ప్రసిద్ధి చెంది మరొక రూపంలో దేవుడు దర్శనమిస్తూ భక్తులను కట్టిపడేస్తుం ది ఆ క్షేత్రం. భయాలను పారద్రోలి వరాల నొసిగే కల్పతరువు గా వాసికెక్కాడు అక్కడున్న దేవదేవుడు.. ఆ పావన ప్రదేశ మే సింగోటం. లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు స మయం ఆసన్నమైంది. సంక్రాంతి పర్వదినాన జాతరకు అంకురార్పణ కానుంది.
నాటి సింగవట్నమే... నేటి సింగోటం
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సింగో టం గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది. జటప్రో లు సంస్థానాన్ని పాలించిన సురభి రాజు సింగమనాయుడు అదే గ్రామంలో ఓ పొలంలో లింగాకారంలో వెలసిన లక్ష్మీ న రసింహ స్వామిని ఈ గ్రామంలో ప్రతిష్ఠించారు. సింగమనా యుడు పేరు మీద ఉన్న గ్రామం సింగవట్నంగా గుర్తింపు పొంది కాలక్రమేణా సింగోటంగా మారిపోయింది. లక్ష్మీనర సింహ స్వామి దేవాలయం పక్కనే శ్రీవారి సముద్రం జలాశ యం ఉంది. మరోవైపు పుష్కరిణి భక్తులను ఎంతో కనువిం దు చేస్తుంది. ప్రతీ ఏటా సంక్రాంతి నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పా టు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్ష్మీ నరసింహుని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆలయ ఫౌండర్ ట్రస్టు చైర్మన్ సురభి రాజా ఎస్‌వీకేకేబీ ఆదిత్య లక్ష్మారావు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఇ ప్పటికే ఆలయం ముందు భాగంలో భక్తులు క్యూ లైన్‌లో ఎండలో నిల్చోకుండా తాత్కాలికంగా తడకలతో షెడ్లు ఏర్పా టు చేశారు. భక్తులు క్యూ లైన్‌లో వెళ్లేందుకు బారికేడ్లు ఏ ర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ల క్ష్మి నరసింహ స్వామి ఆలయ విడిది గదులను అందుబాటు లో ఉంచారు. సింగోటం శ్రీవారం సముద్రంలో భక్తులు పర్యాటకులు విహరించేలా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో బోటు ఏర్పాటు చేయనున్నారు. 15 రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కానున్నారు.
నిఘా ఏర్పాటు
సింగోటం లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రాయ లసీమ ఆంధ్ర రాష్ట్రాలతో పాటు కర్ణాటక , తమిళనాడు నుం చి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రాయలసీమకు చెం దిన భక్తులు సోమశిల కృష్ణానది మీదుగా మర బోటు ప్ర యాణం చేస్తూ వచ్చి లక్ష్మీ నరసింహుని దర్శించుకుంటారు. ఎలాంటి లైవ్ జాకెట్లు లేకుండా బోటు ప్రయాణం చేయకుం డా పోలీసులు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కృష్ణానది తీరాన గట్టిగా ఏర్పాటు చేయనున్నారు. స్థాయికి మించి బోటులో జనం ప్రయాణించకుండా అవగాహన కల్పించనున్నారు.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్
లక్ష్మీ నరసింహుని బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఈనెల 15వ తేదీ రోజు రాత్రి 8 గంట లకు కల్యాణోత్సవం , 16న రాత్రి 7 గంటలకు ప్రభోత్స వం, 17న సాయంత్రం 4 గం టలకు రథోత్సవం, షిడే మ హోత్సవం, 18న రాత్రి 7 గం టలకు పుష్కర హరిణిలో తె ప్పోత్సవం, 20న రాత్రి హంస వాహన సేవ కార్యక్రమాలతో లక్ష్మీ నరసింహ స్వామి బ్ర హ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కార్య నిర్వాహక కార్య దర్శి చిలుకూరి రంగారావు తెలిపారు.