Share News

మునిసిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:05 PM

మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికు లందరినీ పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, కార్యదర్శి బాల్‌రామ్‌ డిమాండ్‌ చేశారు.

మునిసిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
నారాయణపేటలో మునిసిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కార్మికులు

- సీఐటీయూ డిమాండ్‌

- కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

నారాయణపేట/మక్తల్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికు లందరినీ పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, కార్యదర్శి బాల్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయం ముందు యూనియన్‌ కోశాధికారి సాయిలు అధ్యక్షతన నిర్వహించిన కార్మికుల నిరసన దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మునిసిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని లేకపోతే జనవరి 6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్లరేట్ల ముందు ధర్నా చేస్తామన్నారు. అనంతరం డిమాండ్లతో కూ డిన వినతిపత్రాన్ని మునిసిపల్‌ కమిషనర్‌ సునీతకు అందజేశారు. కార్యక్రమంలో మల్లేష్‌, వెంకటేష్‌, నారాయణ, అనిల్‌, నాగరాజు, గోపి, కేశవులు, నర్సిములు తదితరులున్నారు.అదేవిధంగా, మక్తల్‌ మునిసిపల్‌ కార్యాలయం ముందు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు, నాయకులు కర్రెంకృష్ణ, జాకీర్‌హుసేన్‌, కార్మికులు వెంకటగిరి, మారెప్ప, కురుమూర్తి, రాఘవరెడ్డి, అమర్‌, అనిత, రాజు, ఆనంద్‌కుమార్‌, బాలస్వామి ఉన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:06 PM