ఎంఎస్‌పీ చట్టాన్ని అమలు చేయాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:29 PM
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకే ఎస్)జిల్లా ఉపాధ్యక్షుడు గవినోల్ల వెంకట్‌రెడ్డి అన్నారు.

- ఏఐయూకేఎస్ డిమాండ్
- తహసీల్దార్ కార్యాలయాల ముందు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా
ఊట్కూర్/దామరగిద్ద/మక్తల్/ మద్దూర్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకే ఎస్)జిల్లా ఉపాధ్యక్షుడు గవినోల్ల వెంకట్‌రెడ్డి అన్నారు. ఆల్ ఇండియా యూనైటెడ్ కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఊట్కూర్ తహసీల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మోదీ ప్రభుత్వం నల్లచట్టాలు రద్దు చేసి, పంటలకు కనీస మద్దతు ధరను ఇచ్చేలా ఎంఎస్‌పీ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చి తన పరిపాలన కాలం పూర్తయి మళ్లీ అధికారంలోకి వచ్చినా దాని ఊసే ఎత్తకపో వడం శోచనీయమన్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసాను ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12 వేలు అంటూ పేర్కొం టున్నారని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు ్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల తొమ్మిదిన దేశవ్యాప్తంగా డిమాండ్ డే నిర్వహిం చనున్నట్లు తెలిపారు. అంతకుముందు మండల అధ్యక్షుడు చంద్రాములు, కార్యదర్శి అంజప్పలు మాట్లాడారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రవికి అం దించారు. ధర్నాలో చిన్నబాలు, రవి, లొట్టి గోవిందు, రామాంజనేయులు, చెన్నప్ప, జి.గోవర్దన్‌రెడ్డి, ఎల్లప్ప, బాలరాజు, హన్మంతు, నర్సిములు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
అదేవిధంగా, దామరగిద్ద తహసీల్దార్ కార్యా యం ముందు అఖిల భారత ఐక్య రైతు సం ఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు పెద్దింటి తాయప్ప మాట్లాడారు. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కోశాధికారి పెద్దింటి మధు, కర్రెప్ప, ఎం.పెంటప్ప, ఎం.కాశప్ప, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సతీష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ నాయకులు ఎస్.కిరణ్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. సంఘం మండల అధ్యక్షుడు ఆనంద్, జిల్లా నాయకులు రాజు, బుట్టో, గోపాల్, ప్రసాద్, గడ్డం ఆంజనేయులు, ఆశప్ప, నక్క తాయప్పలు పాల్గొన్నారు.
మద్దూర్‌లోని తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ ర్యంలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ మహేశ్‌గౌడ్‌కు అందించారు. ఏఐయూకేఎస్ జిల్లా కార్యదర్శి యాదగిరి. సహా య కార్యదర్శి కొండ నర్సిములు, హనుమప్ప, సాయిలు, హన్మంతు, పాండు, పీడీఎస్‌యూ నాయకుడు విజయ్, పీవైఎల్ నాయకుడు కాశీతో పాటు, రైతులు పాల్గొన్నారు.