Share News

వాహనదారులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:49 PM

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ భాగ్య లక్ష్మిరెడ్డి తెలిపారు.

వాహనదారులు నిబంధనలు పాటించాలి
మక్తల్‌లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న సీఐ చంద్రశేఖర్‌

మక్తల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ భాగ్య లక్ష్మిరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని నారాయణపేట క్రాస్‌రోడ్‌ వద్ద వాహనాల తని ఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ద్విచక్రవాహనాలు నడిపేవారు త ప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించే ఉద్దేశంతో వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహ నాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వ రాదన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణంరాజు, శివశంకర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

హెల్మెట్‌ తప్పకుండా ధరించాలి

నారాయణపేట: జిల్లా కేంద్రంలో కొత్త బ స్టాండ్‌ ప్రధాన రహదారిపై ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం తనిఖీ చేపట్టారు. హె ల్మెట్‌ లేకుండా బైక్‌లు నడిపినందుకు 23 బై క్‌లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో బైక్‌లు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 11:49 PM